విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’ టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాహు గారపాటి నిర్మాత. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ బ్యూటీపార్లర్ నడిపించే మోడల్ సోనూగా, లైలా అనే అమ్మాయిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు.
బ్యూటీపార్లర్‌లో మహిళలను ఆకర్షించే సోనూ పాత్రతో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మోడల్ సోనుతో మహిళలు చనువుగా ఉండటంతో మగాళ్లందరూ ఆయనపై అసూయ పెంచుకుంటారు. ఈ నేపథ్యంలో సోనూ అనూహ్యంగా అమ్మాయి లైలాగా అవతారాన్ని ఎత్తాల్సివస్తుంది.
ఈ రెండు పాత్రల్లో విశ్వక్సేన్ చక్కటి వేరియేషన్ కనబరచినట్లు టీజర్ చూస్తే అర్థమవుతున్నది. రొమాన్స్, యాక్షన్, కామెడీ అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, రచన: వాసుదేవ మూర్తి, దర్శకత్వం: రామ్ నారాయణ్.