VS 13 | టాలీవుడ్లో క్లాస్, మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో ఒకడు విశ్వక్సేన్ (Vishwak Sen). రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ క్రేజీ నటుడు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకీ సినిమాలో నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, శ్రద్దాశ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న ఈ మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విశ్వక్సేన్ తాజాగా కొత్త సినిమా VS 13 వార్తను అందరితో పంచుకున్నాడు. నానితో దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ VS 13ను తెరకెక్కిస్తోంది. విశ్వక్సేన్ వైట్ షర్ట్ అండ్ ఖాకీ ప్యాంట్లో పిస్తోల్‌తో గ్యాంగ్ వార్‌ను నియంత్రించే పోలీస్‌గా కనిపిస్తున్న హాఫ్ లుక్ ఒకటి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. హిట్ తర్వాత మరోసారి పోలీసాఫీసర్‌గా గెటప్‌లో కనిపించబోతున్నాడు విశ్వక్సేన్.
హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీకి శ్రీధర్ గంటా కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫర్.సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫర్. టైటిల్, ఫస్ట్ లుక్, హీరోయిన్, మ్యూజిక్ కంపోజర్, ఇతర నటీనటుల వివరాలపై రానున్న రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నారు మేకర్స్.
In a bent system, he refused to break, MASS KA DAS @VishwakSenActor marches to straighten the path 🔥🔥@SLVCinemasOffl Production No.8 is #VS13 – a High Voltage Action Drama 💥
Written and directed by #SreedharGanta@sudhakarcheruk5 @innamuri8888 @AJANEESHB @kishorkumardop… pic.twitter.com/FMk4do6s4R
— BA Raju’s Team (@baraju_SuperHit) August 6, 2024
NTR Neel | హమ్మయ్య.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా లాంచ్ డేట్ ఫైనల్..!