ఫలక్‌నుమా దాస్ (Falaknuma das) సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ ప్రామిసింగ్ హీరో గతేడాది పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా..బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. తాజాగా విశ్వక్ సేన్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నరేశ్ కుప్పిలి (Naressh Kuppili) డైరెక్ట్ చేయనుండగా..వన్మయి క్రియేషన్స్-విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ల (Vishwaksen Cinemas banners)పై సంయుక్తంగా కరాటే రాజు నిర్మించనున్నారు.
ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, సంభాషణలు అందిస్తున్నాడు. పాగల్ సినిమా తర్వాత కోలీవుడ్ భామ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) మరోసారి ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. కామెడీ థ్రిల్లర్‌గా యూనిక్ కథాంశంతో రాబోతున్న ఈ చిత్రానికి దాస్ కా ధమ్కీ (Das Ka Dhumki) అనే క్రేజీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మేకర్స్ విడుదల చేసిన టైటిల్ పోస్టర్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.
KHEL SHURuuu🃏
Paagal combo is back📣'Mass Ka Das' @VishwakSenActor’s #VS8 is #DasKaDhumki 💥
Co-🌟ing @Nivetha_Tweets #VanmayeCreations #VScinemas #ProdNo2
Director @NaresshLee
Producer #KarateRaju
✍🏻 @KumarBezwada
📽️ #DineshKBabu
🎵@leon_james
✂️#AnwarAli pic.twitter.com/MFFIhFRa3B— BA Raju's Team (@baraju_SuperHit) March 9, 2022
టైటిల్ వెనుక పేక ముక్కలు కనిపిస్తుండగా…వాటి ముందు వెయిటర్ యూనిఫాంలో ఉన్న వ్యక్తి జోకర్‌గా కనిపిస్తుండటం గమనించవచ్చు. మార్చి 14 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా కంటెంట్‌పై ఆత్మవిశ్వాసంతో ఉన్న టీం షూటింగ్‌ను జెట్ స్పీడులో పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు.