యువ హీరో విశ్వక్సేన్ కథనందిస్తూ ‘కల్ట్’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘లైక్ ఏ లీప్ ఇయర్ 2024’ ఉపశీర్షిక. 25 మంది నూతన నటీనటులు పరిచయం అవుతున్న ఈ చిత్రానికి తాజుద్దీన్ దర్శకుడు. స్వీయ నిర్మాణ సంస్థలు వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ పతాకాలపై విశ్వక్సేన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శనివారం జరిగిన లాంచ్ ప్రెస్మీట్లో విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘యధార్థ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథ తయారు చేశాను. ఇందులో ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు లీడ్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆడిషన్ వీడియోలు పంపించవొచ్చు. కామెడీ థ్రిల్లర్ కథాంశమిది. వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుంది. త్వరలో సినిమాను ప్రారంభిస్తాం’ అన్నారు.