విశ్వక్సేన్ నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘మెకానిక్ రాకీ’. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. రవితేజ ముళ్లపూడి దర్శకుడు. రామ్ తాళ్లూరి నిర్మాత. అక్టోబర్ 31న దీపావళి కానుకగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమాలో ‘గుల్లెడు గుల్లెడు..’ అంటూ సాగే తొలి పాటను ఈ నెల 7న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
సోమవారం ఈ పాటకు సంబంధించిన పోస్టర్ని కూడా విడుదల చేశారు. విశ్వక్, మీనాక్షి చౌదరిపై ఈ పాట చిత్రీకరించినట్టు పోస్టర్ చెబుతున్నది. ట్రైయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘురామ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ కాటసాని, సంగీతం: జేక్స్ బిజోయ్, నిర్మాణం: ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్.