బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బాపు’. ‘ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ’ ఉపశీర్షిక. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. దయా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. రాజు, సి.హెచ్. భానుప్రసాద్ రెడ్డి నిర్మాతలు. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకురానుంది. మధుర ఆడియో ద్వారా ఈ సినిమా విడుదలకానుంది.
మంగళవారం టీజర్‌ను అగ్ర కథానాయిక రష్మిక మందన్న సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. టీజర్ లాంచ్‌కు యువ హీరో విశ్వక్సేన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పల్లెటూళ్లలో మానవ సంబంధాలను, డబ్బు అవసరం వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారనే విషయాలను ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించామని నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి తెలిపారు.
ఎలాంటి క్యారవాన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోకుండా, కరీంనగర్‌లోని ఓ పల్లెటూరిలో ఈ సినిమా షూటింగ్ జరిపామని, వినూత్న కథతో ఆకట్టుకుంటుందని బ్రహ్మాజీ పేర్కొన్నారు. కొత్త కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాను ఆదరించాలని దర్శకుడు దయ కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.