‘కల్ట్’లో కనికరం లేని పోలీస్
‘ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చేసిన ప్రయత్నమిది. ఈ సినిమా కోసం చాలా ఎక్స్పెరిమెంట్స్చేశాను.
‘ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చేసిన ప్రయత్నమిది. ఈ సినిమా కోసం చాలా ఎక్స్పెరిమెంట్స్చేశాను. అసలు ఈ సినిమా రాసుకున్నప్పుడు.. ఇది కలలా కాగితంపైనే ఉండిపోతుందేమో అనుకున్నాను.కానీ దీన్ని వెండితెరపైకి తెచ్చిన తారక్ సినిమాస్‌కి ధన్యవాదాలు. ఇది చాలా క్రేజీ సినిమా. ఎక్కడాకాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా తీశాను.
హై క్వాలిటీ ప్రొడక్ట్‌గా ఇది రానున్నది. సున్నిత మనస్కులు, చిన్న పిల్లలు ఈ సినిమాకు కొంచెం దూరంగా ఉండాలని కోరుతున్నా. ఎందుకంటే ఇదిచాలా వైల్డ్ సినిమా. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టారు. థియేటర్లో అంతా ఈ సినిమాను 6.5 సౌండ్‌లో చూడమని కోరుతున్నా’ అని చిత్ర దర్శకుడు, కథానాయకుడు విశ్వక్సేన్ అన్నారు.
ఆయన స్వీయ దర్శకత్వంలో నటించిన స్లాషర్ థ్రిల్లర్ ‘కల్ట్’. సందీప్ కాకరాల నిర్మాత. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈచిత్రం ఈ నెల 30న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్సేన్ మాట్లాడారు. ఇంకా నటులు కార్తికేయ, తారక్ పొన్నప్ప, యజ్ఞ తుర్లపాటి, అనిరుథ్ కూడా మాట్లాడారు. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్, స్లాషర్ ఎలిమెంట్స్‌తో సాగింది. విశ్వక్సేన్ ఈ ట్రైలర్లో కనికరం లేని పోలీస్‌గా కనిపించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

