బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమంలో ఇప్పటికే ఎనిమిది మంది ఎలిమినేట్ కాగా, ఈ వారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు.ప్రస్తుతం హౌజ్‌లో 11 మంది సభ్యులు ఉండగా, ఆదివారం మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే ఆ సంఖ్య 10కి చేరుతుంది. ఈ వారం కెప్టెన్ షన్ను తప్ప మిగిలిన 10 మంది నామినేషన్ లో ఉన్నారు. అయితే నామినేషన్స్ నుంచి ఒకర్ని తప్పించడానికి ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు.
ఈ గేమ్ లో చివరి వరకు ఆడి యాని మాస్టర్ నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. దీంతో యాని మాస్టర్ కి స్పెషల్ పవర్ ఇచ్చి ఒకరిని సేవ్ చేయమని బిగ్ బాస్ అన్నాడు. దాంతో యానీ మాస్టర్ మానస్‌ని సేవ్ చేసింది. గతంలో మానస్ తన కోసం లెటర్ త్యాగం చేశాడు అందుకే ఇప్పుడు నేను మానస్ ని సేవ్ చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది.
ప్రస్తుతం నామినేషన్లో అనీ మాస్టర్, షణ్ముఖ్, మానస్ తప్ప మిగతా వారందరు ఉన్నారు. వారిలోవిశ్వ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. అతను ఏడవడం, లేదంటే గొడవపడడంతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఇది విశ్వకు నెగెటివ్ కాగా,తొమ్మిదో వారం హౌజ్ నుండి బయటకు వెళ్లే కంటెస్టెంట్ విశ్వ అని అంటున్నారు.