విశ్వ, ఐశ్వర్య జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నా గురించి నీకు తెలియాలి’ ఇటీవల ప్రారంభమైంది. వెంకటేష్ కలివెల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సంజన కలివెల నిర్మిస్తున్నారు. ముక్కోణపు ప్రేమకథా చిత్రమిదని, సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని, నేటి ట్రెండ్‌కు తగినట్లుగా రూపొందించబోతున్నామని దర్శకుడు తెలిపారు.
ఈ నెలాఖరు నుంచి కోనసీమలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతామని, సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ధర్మేంద్ర దివి, సంగీతం: వర్ధన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకటేష్ కలివెల.