శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘విష్ణు విన్యాసం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘నో బ్రేక్స్-జస్ట్ లాఫ్స్’ ఉపశీర్షిక. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. సోమవారం యానిమేషన్ వీడియో ద్వారా టైటిల్‌ను రివీల్ చేశారు. ‘చరిత్ర, సంఖ్యా శాస్త్రం, జ్యోతిష్యం అన్నీ అతని కోసమే కనుగొనబడ్డాయి’ అనే వాయిస్ ఓవర్‌తో యానిమేషన్ వీడియో ఆకట్టుకుంది. శ్రీవిష్ణు శైలి వినోదంతో ఆద్యంతం నవ్వుల్ని పంచే చిత్రమిదని, రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని, ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. నయన్ సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: రథన్, రచన-దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు.