శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రంలో మోహల్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర తారలు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం టీజర్‌ను విడుదల చేశారు. నాస్తికుడైన కన్నప్ప పరమ శివభక్తుడిగా మారే సంఘటనల నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది.
యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. శివపార్వతులుగా అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ కనిపించారు. చివరిగా రుద్రుడి పాత్రలో ప్రభాస్ ఎంట్రీ హైలైట్‌గా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.