యాక్షన్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ఎనిమి. మల్టీ స్టారర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఆర్య ప్రధాన పాత్ర పోషించాడు. నవంబర్ 4వ తేదీన విడుదలకాబోతోన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో విశాల్ పాల్గొంటున్నాడు. రీసెంట్గా హైదరాబాద్‌లో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరగగా, తన స్నేహితుడైన పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు ప్రకటించారు విశాల్.
తన సినిమాలకు సంబంధించిన ప్రతి టికెట్ ధర నుంచి ఒక రూపాయి రైతులకు చేరేలా చేస్తున్నారు. అంతే కాదు తనకు సంబంధించిన ఫంక్షన్స్ లో బొకేలను వాడొద్దని వాటికీ ఉపయోగించే డబ్బు ఆడపిల్లల చదువుకు ఉపయోగించమని కోరారు విశాల్. అయితే తాజాగా విశాల్ నడక దారిన తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి మొక్కు చెల్లింపులో భాగంగా అలిపిరి కాలిబాట మార్గం గుండా నడుచుకుంటూ తిరుమల చేరారు విశాల్. మార్గమధ్యలో భక్తులు విశాల్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.
విశాల్ నటించిన ‘ఎనిమి’ చిత్రం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కగా, మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ చిత్రంపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.
Hero @VishalKOfficial visited Thirumala thirupathi devasathanam and offered prayers earlier today. ✨@RojaSelvamaniRK @actorramanaa pic.twitter.com/lnR0yq5yge
— BA Raju's Team (@baraju_SuperHit) November 3, 2021