Vishal | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ విశాల్. ప్రతీ సినిమాకు ఏదో ఒక కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు విశాల్. ఈ టాలెంటెడ్ యాక్టర్ యువర్స్ ప్రాంక్లీ విశాల్ (Yours Frankly Vishal) పోడ్కాస్ట్తో రాబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ ప్రోమో విడుదల చేసిన విశాల్ పలు సమస్యల గురించి మాట్లాడాడు.
ఇందులోప్రత్యేకించి స్టంట్స్ చేస్తున్న సమయంలో డూప్స్ ని పెట్టడం గురించి చెప్పాడు. ఇప్పటిదాకా నేను డూప్‌ను చూడలేదు. నా శరీరంపై ఇప్పటిదాకా 119 కుట్లు పడ్డాయన్నాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. రాబోయే పోడ్కాస్ట్లో ఎలాంటి ఆసక్తికర విషయాలు చెబుతాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
నటి సాయిధన్సికను త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్న విశాల్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 21 ఏండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు విశాల్. ఈ సందర్భంగా అభిమానులు తనపై కురిపిస్తున్న ప్రేమ, మద్దతు వల్లే తను ప్రాణాలతో అందరి ముందున్నానన్నాడు.
నా తల్లిదండ్రులు, గురువు యాక్షన్ కింగ్ అర్జున్, తండ్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నాడు విశాల్ . నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎన్నో కలలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. మీ ప్రేమ, నమ్మకం, ప్రశంసలు, మీ అందరికీ వినోదాన్ని పంచే ఓ నటుడిగా మారేలా చేశాయన్నాడు విశాల్.