Makutam Movie | ఇటీవల మదగదరాజ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న నటుడు విశాల్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన కెరీర్లో 35వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి ‘మకుటం’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆదివారం ఒక ఆసక్తికరమైన టీజర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విశాల్‌ను ఒక శక్తివంతమైన పాత్రలో చూపించారు. యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో విశాల్ సరసన దుషారా విజయన్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. వారి బ్యానర్లో ఇది 99వ చిత్రం.