అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటైర్టెన్మెంట్స్ యువతారలతో రూపొందిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘VISA – వింటారా సరదాగా’. అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా ఉద్భవ్ రఘు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని శనివారం హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. అమెరికా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టీజర్ చెబుతున్నది.
ఎన్నో కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన తెలుగు విద్యార్థుల ప్రయాణాన్ని చూపిస్తూ టీజర్ సాగింది. స్నేహం, ప్రేమ, గందరగోళం, ఊహించని సవాళ్లు.. ఈ ఎమోషన్సన్నీ టీజర్లో కనిపించాయి. ఇది భావోద్వేగాలతో కూడిన మధురమైన ప్రయాణం అని, టీజర్లో మాదిరిగానే సినిమాలో కూడా అశోక్ గల్లా, శ్రీగౌరీప్రియ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని, యువతరంతోపాటు కుటుంబ ప్రేక్షకులు కూడా మెచ్చేలా ఉండే వినోదాత్మక చిత్ర ఇదని మేకర్స్ చెబుతున్నారు.
రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య.