Virata Parvam Trailer Date Announced | రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరాటపర్వం’. ‘నీది నాది ఒకే కథ’ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. గతేడాది ప్రథమార్థంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే మేకర్స్ విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరుస అప్డేట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
రానా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న విరాట పర్వం ట్రైలర్‌ను జూన్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. గతేడాది విడుదలైన టైటిల్ పోస్టర్ నుంచి ఇటీవలే విడుదలైన నగాదారిలో పాట వరకు ప్రతీది ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఉత్తర తెలంగాణలో 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రియమణి కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు నిర్మించాడు.
Love is the biggest form of revolution!❤️🔥#VirataParvam Trailer on June 5th.#VirataParvamOnJune17th@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm #SureshBobbili #DivakarMani @dancinemaniac @SureshProdns @SLVCinemasOffl @LahariMusic pic.twitter.com/UU3qcKqUOU
— Suresh Productions (@SureshProdns) June 3, 2022