Virat Kohli | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, సెన్సేషనల్ దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన స్పై థ్రిల్లర్ ధురంధర్: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సినిమాపై తన స్పందన తెలియజేయడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. విరాట్ కోహ్లీ ఈ చిత్రాన్ని చూసిన తర్వాత సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “ధురంధర్ 2 నాకు అద్భుతమైన సినీ అనుభూతిని ఇచ్చింది. భారతీయ సినిమాల్లో ఇలాంటి అనుభవం నేను ఇంతకుముందు చూడలేదు. సినిమా దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ ఒక్క క్షణం కూడా దృష్టి మళ్లలేదు. ప్రతి ఎమోషన్‌ను అద్భుతంగా చూపించారు” అంటూ ఆయన పేర్కొన్నారు.
దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను కోహ్లీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయనను ‘జీనియస్’గా అభివర్ణిస్తూ, సినిమా నిర్మాణం, కథనం పట్ల ఆకట్టుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో హీరో రణ్వీర్ సింగ్ నటనపై కూడా కోహ్లీ ప్రత్యేకంగా స్పందించారు. సినిమాలోని నటీనటులందరూ అద్భుతంగా చేశారు. కానీ రణ్వీర్ సింగ్ ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాడు. అతని నటన అద్భుతానికి అతీతం… అబ్సల్యూట్లీ వావ్! అంటూ ప్రశంసించారు. కోహ్లీ ప్రశంసలకు దర్శకుడు ఆదిత్య ధర్ భావోద్వేగంతో స్పందించారు. విరాట్, నీలాంటి లెజెండ్ నుంచి ఇలాంటి మాటలు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. అండర్-19 రోజుల నుంచి నీ ఆటను ఫాలో అవుతున్నాను. దేశం కోసం నువ్వు ఆడే తీరు మాకు స్ఫూర్తినిస్తుంది. మా సినిమాల ద్వారా భారత్ గర్వపడేలా చేయడానికి ఎప్పుడూ కృషి చేస్తాం అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇక బాక్సాఫీస్ పరంగా చూస్తే, “ధురంధర్ 2” ఇప్పటికే రికార్డుల వేటలో దూసుకుపోతోంది. మొదటి రోజే రూ.145 కోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇండియాలో రూ.1000 కోట్ల నెట్ కలెక్షన్ల మార్క్‌ను చేరుకున్న తొలి హిందీ చిత్రంగా కూడా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ ‘హంజా’ అలియాస్ జస్కిరత్ సింగ్ రంగీ అనే గూఢచారి పాత్రలో నటించారు. పాకిస్థాన్‌లోని లియారి ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఛేదించే మిషన్‌లో అతను ఎదుర్కొన్న సవాళ్లు, వ్యక్తిగత గతం కథకు ప్రధాన బలంగా నిలిచాయి. అతనితో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో మెరిశారు. తడ