Nagabandham | టాలీవుడ్లో అభిరుచి ఉన్న దర్శకనిర్మాతల్లో ఒకరు అభిషేక్ నామా. డెవిల్ తర్వాత ఈ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమా నాగబంధం (Nagabandham). పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ్ ఆలయాల్లో గుప్త నిధుల ఆవిష్కరణలను స్పూర్తిగా అడ్వెంచరస్ మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది.
పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ స్టోరీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్తను షేర్ చేశారు మేకర్స్. నాగబంధం చిత్రాన్ని 2026 మార్చి 19న ఉగాది కానుకగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారట. పెదకాపు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విరాట్ కర్ణ ఈ చిత్రంలో లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
ఇస్మార్ట్ భామ నభానటేశ్, ఐశ్వర్య మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్, తారక్ సినిమాస్ బ్యానర్లపై అభిషేక్ నామా, కిశోర్ అన్నపురెడ్డి, లక్ష్మి ఐరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Sukumar | శిష్యుల కోసం సుకుమార్ దుబాయ్ ట్రిప్.. లెక్కల మాస్టారు మంచితనానికి టాలీవుడ్ ఫిదా!
Ayushmann Khurrana | ‘కొత్తలోక’ను తక్కువ చేయలేదు.. ఆయుష్మాన్ ఖురానా క్లారిటీ
Diwali 2025 | దీపావళి స్పెషల్.. టాలీవుడ్ నుంచి కొత్త సినిమా పోస్టర్లను చూశారా.!