Nayanthara | నయన్ కవల పిల్లల ఫస్ట్ బర్త్‌డే.. ఫొటోలు షేర్ చేసిన లేడీ సూపర్ స్టార్
Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) దంపతుల కవల పిల్లల పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తమ ముద్దుల కుమారులు ఉయిర్ (Uyir), ఉలగ్ (Ulag)కు నయన్ సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) దంపతుల కవల పిల్లల పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తమ ముద్దుల కుమారులు ఉయిర్ (Uyir), ఉలగ్ (Ulag)కు నయన్ సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కొన్ని అందమైన ఫొటోలు పంచుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు చిన్నారులకు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. అదే సందర్భంలో ‘క్యూట్ ఫ్యామిలీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్ శివన్ పెద్దల అంగీకారంతో గతేడాది జూన్ 9వ తేదీన వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన 4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా నయన్, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. పిల్లలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ (Uyir RudroNeel N Shivan), ఉలగ్ దీవిక్ ఎన్ శివన్ (Ulag Daiwik N Shivan) అని నామకరణం కూడా చేశారు.
Birthday Boys👨👩👦👦 Uyir RudroNeel & Ulag Daiwik 🫶🏻 Happy 1st Birthday U2🎂😇 pic.twitter.com/jS4KnjA9ax
— Nayanthara✨ (@NayantharaU) September 26, 2023
Also Read..
Google | గూగుల్ 25వ వార్షికోత్సవం నేడు.. ప్రత్యేక డూడుల్
Minister Jaishankar: ఫైవ్ ఐస్, ఎఫ్‌బీఐలో భాగస్వామ్యులం కాదు: జైశంకర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

