Minister Jaishankar: ఫైవ్ ఐస్, ఎఫ్‌బీఐలో భాగస్వామ్యులం కాదు: జైశంకర్
Minister Jaishankar: నిజ్జార్ హత్య గురించి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేదని మంత్రి జైశంకర్ అన్నారు. ఫైవ్ ఐస్ దేశాలతో కానీ, ఎఫ్బీఐతో కానీ తాము భాగస్వామ్యులం కాదు అని మంత్రి పేర్కొన్నారు. న్యూయార్క్‌లో జరుగుతున్న విదేశీ వ్యవహారాల మండలి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యా ఘటనపై భారత్, కెనడా దేశాలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. నిజ్జార్ హత్యపై కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్(Minister Jaishankar) స్పందించారు. నిజ్జార్ గురించి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేదన్నారు. ఫైవ్ ఐస్ దేశాలతో కానీ, ఎఫ్బీఐతో కానీ తాము భాగస్వామ్యులం కాదు అని మంత్రి జైశంకర్ అన్నారు. న్యూయార్క్‌లో జరుగుతున్న విదేశీ వ్యవహారాల మండలి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నిజ్జార్ హత్య కేసులో భారత్ పాత్ర ఉన్నట్లు కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేసిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే ఫైవ్ ఐస్ పార్ట్‌నర్స్‌తో నిజ్జార్ గురించి ఇండియా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని షేర్ చేసుకున్నట్లు ఇటీవల అమెరికా పేర్కొనడంతో ఆ వివాదం మరింత ముదిరినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జైశంకర్ స్పందించారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఫైవ్ ఐస్‌లో తాము భాగం కాదు అని, ఎఫ్బీఐతోనూ తాము భాగస్వాములం కాదు అని అన్నారు. సరైన వ్యక్తిని ఆ ప్రశ్న వేయడంలేదని అన్నారు.
కెనడాలో వ్యవస్థీకృత నేరాలు జరుగుతున్నట్లు మంత్రి జైశంకర్ ఆరోపించారు. రాజకీయ కారణాల కోసం ఆ నేరాల్ని కెనడా భరిస్తున్న తీరును కూడా ఆయన ఖండించారు. నిజ్జార్ హత్యలో భారత్ పాత్ర ఉన్నట్లు కెనడా చేసిన ఆరోపణలను ఆయన తిరస్కరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

