Jailer Success | ‘జైలర్’ సక్సెస్.. రజనీకి రూ.100 కోట్ల చెక్ ఇచ్చిన మారన్..?
Jailer Success | సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం జైలర్ (Jailer). తమన్నా, రమ్యకృష్ణ కథానాయికలుగా నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం.
Jailer Success | సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం జైలర్ (Jailer). తమన్నా, రమ్యకృష్ణ కథానాయికలుగా నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం.
ఇక ‘జైలర్’ విజయంతో చాలా ఖుషీగా ఉన్న సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ (Kalanithi Maran) నిన్న రజనీకాంత్‌ను కలుసుకున్న విషయం తెలిసిందే. జైలర్ సినిమా సక్సెస్‌తో పాటు లాభాలు కూడా భారీగా రావడంతో అందులో నుంచి కొంత భాగాన్ని చెక్ రూపంలో రజనీకాంత్‌కు కళానిధి మారన్ అందజేశారు.. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. అయితే ఈ చెక్ విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని సమాచారం. రజనీకాంత్‌కు ఇచ్చిన చెక్కు కవర్‌పై ‘ది రియల్ రికార్డ్ మేకర్’ (The Real Record Maker) అని రాసి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు రెమ్యునరేషన్‌గా రూ. 110 కోట్లు మొదట రజనీకాంత్ తీసుకున్నారని సమాచారం. ఒకవేళ అదే నిజమైతే ‘జైలర్’ కోసం రజనీకాంత్ అందుకున్న మొత్తం పారితోషకం రూ. 210 కోట్లకు చేరుతుంది.
Mr. Kalanithi Maran met Superstar @rajinikanth and handed over a cheque, celebrating the historic success of #Jailer pic.twitter.com/Y1wp2ugbdi
— Sun Pictures (@sunpictures) August 31, 2023
#JailerSuccessCelebrations continue! Superstar @rajinikanth was shown various car models and Mr.Kalanithi Maran presented the key to a brand new BMW X7 which Superstar chose. pic.twitter.com/tI5BvqlRor
— Sun Pictures (@sunpictures) September 1, 2023
మరోవైపు ఈ చెక్‌తో పాటు కళానిధి మారన్ రజనీకి కాస్ట్లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. దాదాపు రూ.1.24 కోట్ల విలువచేసే బ్లాక్ కలర్ BMW X7 సిరీస్ కారును కళానిధి మారన్ బహుమతిగా ఇచ్చాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

