Singareni JungSiren | బొగ్గు గనుల్లో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. ‘జార్జిరెడ్డి’ సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు జీవన్‌రెడ్డి. ఇప్పుడు ఆయన కథను అందిస్తున్న తాజా చిత్రం ‘సింగరేణి జంగ్ సైరన్’. ఈ సినిమాకు వివేక్ ఇనుగుర్తి దర్శకత్వం వహించనుండగా.. ధూమ్ర వారాహి బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టైటీల్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. 1999లో సింగరేణిలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు దర్శకుడు తెలిపాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యాయని త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని చిత్రయూనిట్ తెలిపింది. మరిన్ని వివరాలను మేడే రోజున వెల్లడించనుండగా. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి. సినిమాటోగ్రఫీ: రాఖీ వన మాలి, ఎడిటర్: హరీష్ మధురెడ్డి.
#DhumraVarahiProductions Prod No.1 #SingareniJungSiren written by @GeorgeReddyG1
A Survival Drama BASED ON TRUE STORY! Shoot begins soon#G1Stories #VivekInugurti @sureshbobbili9 #HarishMadhureddy @enugurthi_73551 pic.twitter.com/q1TwzBSaht
— Shreyas Media (@shreyasgroup) April 21, 2024