అభిజ్ఞా పూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’. సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సీరిస్‌కి కృష్ణ పోలూరు దర్శకుడు. శ్రీరామ్ నిర్మాత. ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో శుక్రవారం నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నది.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ని నిర్వహించారు. నిర్మాత మాట్లాడుతూ ‘ ‘విరాటపాలెం’ నన్నెంతో హంట్ చేసిన కథ. చూసినవారంతా మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది.’ అన్నారు. ఇంకా జీ5 ప్రతినిథులు అనూరాధ, దేశ్రాజ్, సంజయ్, లాయిడ్లతోపాటు స్క్రీన్‌ప్లే రైటర్ విక్రమ్‌కుమార్, కథారచయిత దివ్య తేజస్వీ, డీవోపీ మహేష్, నటులు సూర్యతేజ, కృష్ణతేజ, సతీష్ కూడా మాట్లాడారు.