‘ ‘విరాజి’ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్. మెంటల్ ఆసుపత్రి దగ్గర కొద్దిమంది ఉంటారు. వారి దగ్గరకు ఆండీ వస్తాడు. అతను వచ్చాక గందరగోళం మొదలవుతుంది. అదేంటి అనేది తెరపై చూడాలి. ఈ కథలో అంతర్లీనంగా సందేశం ఉంటుంది. ఇందులో నా లుక్ చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వాటన్నింటికీ సమాధానం రేపు సినిమా చెబుతుంది. ఈ పాత్ర చేసినందుకు గర్విస్తున్నా.
అని వరుణ్‌సందేశ్ అన్నారు. ఆయన కథానాయకుడిగా ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విరాజి’. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుణ్‌సందేశ్ విలేకరులతో ముచ్చటించారు. ‘ఇందులో రెండు డిఫరెంట్ కలర్స్ హెయిర్ స్టయిల్, ముక్కుపుడక, టాటూస్‌తో వైరైటీగా కనిపిస్తా. ఈ సినిమా చేస్తున్నప్పుడు మేకోవర్ కోసమే ఎక్కువ కష్టపడ్డాను. ఆ గెటప్‌లోకి మారడానికే గంటల సమయం పట్టేది.
రీసెంట్గా సినిమా చూశా. నిజంగా భావోద్వేగానికి లోనయ్యా. నా భార్య వితిక కూడా అలాగే ఫీలయ్యింది. ఇందులో నా పాత్ర సగం ఇంగ్లిష్, సగం తెలుగు మాట్లాడుతుంది. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్‌తో పాటు డ్రామా, ఎమోషన్స్ కూడా ఈ కథలో ఉన్నాయి. చాలా ట్విస్ట్‌లు కూడా ఉంటాయి. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ‘విరాజి’ విందు భోజనం లాంటి సినిమా’ అని వరుణ్‌సందేశ్ చెప్పారు.