Cinema News | పి.సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రానికి ‘కాక్రోచ్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. విశాఖపట్నం నేపథ్యంలో సాగే ఈ వయోలెంట్ యాక్షన్ ప్రేమకథలో పాత, కొత్త నటీనటులు నటించారని, షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నదని మేకర్స్ తెలిపారు.
త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: సంతోష్ శక్తి, సంగీతం: ప్రదీప్ చంద్ర, నిర్మాణం: శ్రీలక్ష్మి పిక్చర్స్, ఆదిత్య సినిమాస్.