This Week Movie releases | కూలీ, వార్ 2 సినిమాలు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఇంకా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గతవారం అనుపమ పరదా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ వారం వినాయక చవితి ఉండడంతో పెద్ద సినిమాలేవి ప్రేక్షకుల ముందుకు రావాట్లేదు. రవితేజ మాస్ జాతార ఆగష్టు 27న విడుదలవుతుంది అనుకుంటే అనుకొని కారణాల వలన ఈ చిత్రం వాయిదా పడింది. దీంతో పండగనాడు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. అయితే ఏ సినిమాలు థియేటర్లో ఏ సినిమాలు ఓటీటీలో వస్తున్నాయో చూసుకుంటే.
సుందరకాండ
యువ కథానాయకుడు నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరకాండ’. ఈ సినిమాతో వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వృతి వాఘని కథానాయికగా నటిస్తుండగా.. జూనియర్ శ్రీదేవి కీలక పాత్రలో నటిస్తుంది. రోమాంటిక్ కామెడీగా రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది.
కన్యాకుమారి
యువనటులు శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైని జంటగా నటిస్తున్న చిత్రం ‘కన్యాకుమారి’. ఈ సినిమాకు సృజన్ అట్టాడ దర్శకత్వం వహించగా.. ఆగష్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో శ్రీచరణ్ ఒక రైతు పాత్రలో, గీత్ షైని ఐటీ ఉద్యోగిగా స్థిరపడాలనే లక్ష్యమున్న యువతి కన్యాకుమారి పాత్రలో ఆకట్టుకోనున్నారు. వారి మధ్య ఉండే వైరుధ్యాలు, వాటి చుట్టూ అల్లుకున్న ప్రేమకథ ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
త్రిబాణధారి బార్బరిక్
తమిళ నటుడు సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్. సింహా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్‌పాల్ రెడ్డి అడిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వర్తమాన సంఘటనలకు పౌరాణిక నేపథ్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు మేకర్స్.
ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పరం సుందరి
బాలీవుడ్ యువ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పరం సుందరి’ (Param Sundari). తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సిద్ధార్థ్ పంజాబీ అబ్బాయిగా, జాన్వీ కపూర్ కేరళ యువతిగా నటిస్తుండగా.. ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇంకా ఇవే కాకుండా ఓటీటీలో
అమెజాన్ ప్రైమ్
అప్లోడ్ 4 (వెబ్‌సిరీస్) ఆగస్టు 25
హాఫ్ సీఏ2 (హిందీసిరీస్) ఆగస్టు 27
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ) ఆగస్టు 29
జియో
రాంబో ఇన్ లవ్ (తెలుగు) ఆగస్టు 29
నెట్‌ఫ్లిక్స్
అబిగైల్ (తెలుగు) ఆగస్టు 26
మెట్రో ఇన్ డినో (హిందీ) ఆగస్టు 29
కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్) ఆగస్టు 30