ఏ.నరేంద్ర హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విలేజ్ స్టార్స్’. లిల్లీ బళ్లు కథానాయిక. ఎన్ఎస్వీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్లో జరిగింది. నటుడు సమీర్ అతిథిగా వచ్చి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
అందరికీ నచ్చే కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు,హీరో నరేంద్ర చెప్పారు. ఈసినిమాలో భాగం అయినందుకు కథానాయిక లిల్లీ బళ్లు ఆనందం వెలిబుచ్చారు. ఇంకా జబర్దస్త్ వాసు, నటుడు రాధాకృష్ణ, సామాజిక కార్యకర్త సంపత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: నాగూర్ ఎన్జీఆర్.