హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా అనామలిస్, అన్ మ్యాపింగ్‌కు సంబంధించి జారీ చేసిన నోటీసుల పరిషార ప్రక్రియ కొనసాగుతున్నది. సీఈవో కార్యాలయం శనివారం విడుదల చేసిన వివరాల ప్రకా రం, రాష్ట్రవ్యాప్తంగా 92,88,181 నోటీసులు జారీ చేయాల్సి ఉండగా.. శనివారం వరకు 90,26,993 నోటీసులను సంబంధిత ఓటర్లకు అందజేశారు. 2,61,191 నోటీసులు పంపిణీ చేయాల్సి ఉన్నది.
‘సర్’ ప్రక్రియలో పరిశీలన అనంతరం 59,35,479 మంది ఓటర్లను అర్హులుగా గుర్తించారు. మరోవైపు ఫామ్-7 అభ్యంతరాలపై రాష్ట్రవ్యాప్తంగా విచారణకు ఆదేశించినట్టు సీఈవో కార్యాలయవర్గాలు వెల్లడించాయి. ఓటర్ల జాబితాలో ఇప్పటికే ఉన్నపేరు తొలగించాలని అభ్యర్థించడం కోసం ఫామ్-7 వినియోగిస్తారు. ఓటరు మరణించాడని, ఓటరు శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడని, ఒకే వ్యక్తి పేరు ఎకువచోట్ల నమోదయిందని, నమోదైన వ్యక్తి అర్హత లేనివాడని, భారత పౌరుడు కాదని, ఒక ఓటరు తన పేరు తానే తొలగించుకోవాలనుకున్నప్పుడు ఫామ్-7 ఉపయోగించవచ్చు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 29,000 మంది దరఖాస్తు చేశారు.