వికారాబాద్, అక్టోబర్ 3: వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖానలో కీలకమైన వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో లేక బాధితులను హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో, స్పీకర్ నియోజకవర్గంలోనే సరైన వైద్య సదుపాయాలు లేవనే విషయం రుజువైంది.
అనంతగిరి ఘాట్‌రోడ్డులో ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో గాయపడ్డ మహిళను ఈదవాఖానకు తీసుకొచ్చారు. స్ట్రెచర్ సహాయంతో దవాఖానలోకి ఆమెను తీసుకెళ్తుండగా ఒక్కసారిగా తుప్పు పట్టిన స్ట్రెచర్ విరిగిపోయింది. దీంతో గాయపడ్డ మహిళ స్ట్రెచర్‌పై నుంచి కిందకు జారి పడబోయింది. అక్కడే ఉన్న వారు స్ట్రెచర్‌ను గట్టిగా పట్టుకొని దవాఖానలోకి తీసుకెళ్లారు.