12th Fail Trailer | బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే (Vikranth Massey) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మీర్జాపూర్ (Mirzapur) వెబ్ సిరీస్‌తో ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. ఈ ఏడాది ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘గ్యాస్‌లైట్’ ‘ముంబైకర్ సినిమాలలో కనిపించి అలరించాడు. ఇక విక్రాంత్ మాస్సే తాజాగా నటిస్తున్న చిత్రం 12 ఫెయిల్(12th Fail). విధు వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ గమనిస్తే.. విక్రాంత్ మాస్సే ఇందులో మనోజ్ అనే IPS ఆస్పిరంట్(Aspirant)గా కనిపించబోతున్నాడు. చంబల్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌కు UPSC ప్రిపరేషన్ కోసం వచ్చిన విక్రాంత్ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది కథాంశం. ఇక UPSC కోసం ప్రయత్నించే లక్షలాది విద్యార్థుల నిజమైన కథల నుంచి ఈ చిత్రం రూపొందుతుందని మేకర్స్ తెలిపారు.
ప్రముఖ రచయిత అనురాగ్ పాఠక్ యొక్క బెస్ట్ సెల్లింగ్ నవల 12వ ఫెయిల్ ఆధారంగా ఈ సినిమా రానుండగా.. అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
#12thFailTrailer igniting the fire of #Restart in every heart
Thank you for all the love! ❤️Zero se kar #Restart!
Watch #12thFail in cinemas on 27th October – inspired by a million true stories.#12thFailTrailer out now: https://t.co/bZf5Ev0UiU@ZeeStudios_ @VikrantMassey…
— Vidhu Vinod Chopra Films (@VVCFilms) October 4, 2023