Vikrant Massey | ‘టెన్త్ ఫెయిల్’ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు విక్రాంత్ మస్సే. ఈ సినిమా ఎన్నో అవార్డులను గెలుచుకోవడమే కాకుండా నటుడిగా విక్రాంత్మస్సేను మరో మెట్టెక్కించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం ఈ సినిమా చూసి ప్రశంసలు కురిపించారు. ‘టెన్త్ ఫెయిల్’ సక్సెస్‌తో విక్రాంత్ మస్సేకు బాలీవుడ్లో వరుస అవకాశాలొస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఏడాది తర్వాత తాను సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు విక్రాంత్మస్సే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
తన కుటుంబానికి సమయాన్ని కేటాయించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని, 2025 తర్వాత ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నానని విక్రాంత్ మస్సే తన సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ‘లూటేరా’ (2013) సినిమా బాలీవుడ్‌తో అడుగుపెట్టిన విక్రాంత్ మస్సే హాఫ్ గాళ్‌ఫ్రెండ్, చపాక్, కార్గో, హసీనా దిల్ రుబా, లవ్ హాస్టల్, ఫోరెన్సిక్, సెక్టార్ 36 వంటి చిత్రాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.