విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తంగలాన్’. పా రంజిత్ దర్శకుడు. పార్వతీ, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ వ్యయంతో రూపొందుతున్నది. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్లో విక్రమ్ రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘విక్రమ్ మునుపెన్నడూ చూడని అవతారంలో కనిపిస్తారు. నవంబర్ 1న టీజర్‌ను విడుదల చేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, దర్శకత్వం: పా రంజింత్.