టాలెంటెడ్ హీరో విక్రమ్ (Vikram) నటిస్తోన్న తాజా చిత్రం ‘కోబ్రా’ (Cobra). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్గా నటిస్తోండగా..మృణాళిని రవి కీ రోల్ చేస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
అతడే కోబ్రా..రకరకాలుగా రూపం మార్చుకొని వెళ్లడం తెలుసు..చాటుగా మాటేసి కాటేయడమూ తెలుసు..అనే వాయిస్ ఓవర్‌తో వస్తున్న సంభాషణలతో మొదలైంది ట్రైలర్. విక్రమ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తూ అభిమానులకు కావాల్సిన థ్రిల్‌ను అందించేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసిపోతుంది. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను సినీ లవర్స్ ఎంజాయ్ చేయడం పక్కా అని ట్రైలర్‌తో స్పష్టమవుతుంది.
ఈ చిత్రంలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, డైరెక్టర్ కేఎస్ రవికుమార్, మృణాళినీ రవి, మియా జార్జ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్ తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతుండటం విశేషం. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఆగస్టు 31న తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.