ఓవైపు ‘రౌడీ జనార్దన్’.. మరోవైపు రాహుల్ సంకృత్యాన్ సినిమా. క్షణం తీరిక లేకుండా ఉన్నారు హీరో దేవరకొండ విజయ్. ఇదిలావుంటే.. విజయ్ లైనప్‌లో మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చి చేరిందనేది లేటెస్ట్ న్యూస్. ఇండియన్ సినిమాలో దర్శకుడిగా తనకంటూ ఓ మార్క్‌ని సెట్ చేసిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నట్టు సమాచారం.
హారర్, టైమ్ ట్రావెల్, ప్రేమకథలు ఇలా పొంతనలేని కథలను తెరకెక్కించి, మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విక్రమ్ కె.కుమార్. రేపు ఆయన విజయ్‌తో సినిమా చేయనున్నారనేది దేవరకొండ అభిమానులకు నిజంగా శుభవార్తే. మరి ఈ ఇంట్రెస్టింగ్ కలయిక కోసం విక్రమ్ కె.కుమార్ ఎలాంటి కథ తయారు చేశారో చూడాలి.