Dhruva Natchathiram | విక్రమ్ ధ్రువ నక్షత్రం నుంచి స్టైలిష్ యాక్షన్ లుక్ అదిరింది
Dhruva Natchathiram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) కాంపౌండ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. వీటిలో గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) డైరెక్ట్ చేస్తున్న చిత్రం ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram). ధ్రువ నక్షత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది.
Dhruva Natchathiram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) కాంపౌండ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. వీటిలో తాజా మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram). గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ హీరోయిన్గా నటిస్తోంది. ధ్రువ నక్షత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో కొత్త కొత్త లుక్స్‌ను షేర్ చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు విక్రమ్. ఇప్పటికే రిలీజ్ చేసిన పలు పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో స్టైలిష్ లుక్‌ను షేర్ చేశాడు. విక్రమ్ హెలికాప్టర్ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన లుక్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. గౌతమ్ మీనన్ ఈ చిత్రంలో గూస్బంప్స్ తెప్పించే స్టైలిష్ యాక్షన్ సీన్లను పెట్టాడని తాజా స్టిల్‌తో అర్థమవుతోంది. రీసెంట్గా విక్రమ్ సూట్‌కేస్ పట్టుకొని స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్న లుక్‌ను విడుదల చేయగా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
విక్రమ్ సూపర్ స్టైలిష్ లుక్‌తో అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ అందించబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన లుక్స్ చెబుతున్నాయి. ధ్రువ నక్షత్రం నుంచి లాంఛ్ చేసిన తమిళ, తెలుగు ట్రైలర్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. మెడలో స్కార్ప్, స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ వేసుకున్న విక్రమ్ చేతిలో పిస్తోల్ పట్టుకొని అగ్రెసివ్‌గా కనిపిస్తున్న లుక్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
ముంబై దాడులు జరిగినప్పుడు అక్కడికి ఎన్ఎస్జీ హెలికాప్టర్ రావడం బాగా ఆలస్యమైంది.. అంటూ సాగే డైలాగ్స్‌తో మొదలైన ధ్రువ నక్షత్రం ట్రైలర్.. సినిమా అతి ముఖ్యమైన మిషన్ నేపథ్యంలో సాగనున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ చిత్రంలో ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒండ్రగ ఎంటర్టైన్మెంట్, కొండదువోం ఎంటర్టైన్మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
యాక్షన్ స్పై జోనర్లో వస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ జాన్/ధ్రువ్ పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం.ఈ చిత్రం నుంచి ఇటీవలే కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది.
ధ్రువ నక్షత్రం స్టైలిష్ యాక్షన్ లుక్..
The Relentless Action Execution!
In just 5 Days, John & his Team will take on the centre stage❤🔥#DhruvaNakshathramFromNov24 #DhruvaNakshathram @chiyaan @menongautham @Jharrisjayaraj @riturv @OndragaEnt @oruoorileoru @Preethisrivijay @SonyMusicSouth @GskMedia_PR… pic.twitter.com/XpkzICWuri
— BA Raju’s Team (@baraju_SuperHit) November 19, 2023
సూపర్ స్టైలిష్‌గా విక్రమ్..
#DhruvaNatchathiram – New poster..🔥 #ChiyaanVikram‘s Stylish Action Thriller is Finally gonna see the lights next week..🤙 pic.twitter.com/cLTxeXYU63
— Laxmi Kanth (@iammoviebuff007) November 17, 2023
ధ్రువ నక్షత్రం తాజా పోస్టర్..
A Pulsating Tale packed with High-Octane Action.
Meet at the Basement in 8 Days 💥 #DhruvaNatchathiramFromNov24 #DhruvaNakshathramFromNov24 #DhruvaNatchathiram #DhruvaNakshathram@chiyaan @menongautham @Jharrisjayaraj @riturv @OndragaEnt @Preethisrivijay @SonyMusicSouth… pic.twitter.com/pZcQLam0xs
— Oruoorileoru Film House (@oruoorileoru) November 16, 2023
ధ్రువ నక్షత్రం తెలుగు ట్రైలర్..
ధ్రువ నక్షత్రం తమిళ్ ట్రైలర్..
ధ్రువ నక్షత్రం టీజర్ ..
కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

