Vijay Next Movie | టాక్‌తో సంబంధంలేకుండా విజయ్ థలపతి సినిమాలు కోట్లు కొల్లగొడుతాయని ఆ మధ్య దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు అనిపిస్తున్నాయి. ఇదేం సినిమారా బాబు అనుకున్న ‘బీస్ట్’ రెండోందలకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఔరా అనిపించింది. ఇక సీరియల్ అంటూ ముద్ర పడిన ‘వారసుడు’ సైతం ముడొందల కోట్లు కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. ఇలా ప్రతీ సినిమాకు విజయ్ మార్కెట్ పెరుగుతూనే ఉంది. ఇక ప్రస్తుతం విజయ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌లో విడుదల కానుంది.
ఇక ఈ సినిమా తర్వాత విజయ్.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ తమిళ ప్రొడక్షన్ సంస్థ ఏజీఎస్ ఎంటర్టైనమెంట్స్ అధికారికంగా పోస్టర్‌ను, ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నాడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్.అఘోరాం ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా కోసం విజయ్ దాదాపు రెండోందల కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక వెంకట్ ప్రభు ఇటీవలే దర్వకత్వం వహించిన కస్డడీ ఘోరంగా ఫ్లాప్ అయింది. బడ్జెట్లో పావువంతు కలెక్షన్లు కూడా రికవరీ చేయలేక పోయింది. అంతటి డిజాస్టర్ తర్వాత విక్రమ్‌ప్రభుకు విజయ్‌తో సినిమా చేసే అవకాశం రావడం విశేషమే. ఇక విజయ్ నటిస్తున్న లియో దసరా కానుకగా అక్టోబర్19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా రిలీజైన తర్వాతే వెంకట్ ప్రభూ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
It is our pride and privilege to collaborate again with #Thalapathy @actorvijay Sir for our 25th Film directed by @vp_offl music by @thisisysr #Thalpathy68 #Ags25https://t.co/9VibIEQhgz#KalpathiSAghoram #KalpathiSGanesh #KalpathiSSuresh @archanakalpathi@Jagadishbliss… pic.twitter.com/uP3AKBs2NG
— AGS Entertainment (@Ags_production) May 21, 2023
— AGS Entertainment (@Ags_production) May 21, 2023