తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ 69వ చిత్రం శుక్రవారం చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. రాజకీయ రంగ ప్రవేశం నేపథ్యంలో తన కెరీర్లో ఇదే ఆఖరి చిత్రమని విజయ్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. కేవీయన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రియమణి, ప్రకాష్‌రాజ్, మమిత బైజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్‌సూర్యన్, సంగీతం: అనిరుధ్
రవిచందర్.