విజయ్ సేతుపతి నటిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘ఏసీఈ’. రుక్మిణి వసంత్ కథానాయిక. 7సీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు ఆరుముగకుమార్ దర్శకుడు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా సాంఘిక మాధ్యమం ద్వారా విజయ్‌సేతుపతి ఫస్ట్‌లుక్‌ని, టైటిల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
యూత్ఫుల్లుక్తో అందరినీ ఆకర్షించేలా విజయ్‌సేతుపతి లుక్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీజర్లో విజయ్‌సేతుపతి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలావుందో, అంతకు పదింతలు సినిమాలో ఉంటుందని, క్రైమ్ నేపథ్యంలో వినోదభరితంగా సాగే సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. యోగిబాబు, పి.ఎస్.అవినాష్, దివ్యపిైళ్లె, రాజ్‌కుమార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకర్.