Vidudhala Part 2 Twitter Review | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వాస్తవ సంఘటనలను సిల్వర్ స్క్రీన్‌పై కండ్లకు కట్టినట్టు చూపించే అతికొద్ది దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ (Vetri Maaran). అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ప్రాంచైజీ ప్రాజెక్ట్‌లో వచ్చిన సీక్వెల్ విడుదల పార్ట్ 2 (Vidudhala Part 2).
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) లీడ్ రోల్లో నటించగా.. సూరి, మంజు వారియర్ (Manju Warrier) కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. మరి నెట్టింట ఈ సినిమాపై టాక్ ఎలా ఉందో ఓ లుక్కేద్దామా..
నెట్టింట టాక్, రివ్యూ ఇలా..
#ViduthalaiPart2 First Half – Above average to Good 👌
– Started off with a Banger & hard hitting 30 mins🩸
– Filled with Flashback of VJS… Contemporary portions were just 15 mins🤝
– Few scenes felt dragged due to the over usage of Revolution !!
– VijaySethupathi as performer… pic.twitter.com/7AxiXCFo11— AmuthaBharathi (@CinemaWithAB) December 20, 2024
ఫస్ట్ హాఫ్ యావరేజ్ నుంచి బాగుంది. బలమైన సన్నివేశాలు, బ్యాంగర్తో మొదలైంది. విజయ్‌సేతుపతి ఫ్లాష్‌బ్యాక్.. సమకాలనీ అంశాలతో సాగే సీన్లు 15 నిమిషాలపాటు ఉంటాయి. విప్లవాత్మక అంశాలను ఎక్కువగా చూపించడం వల్ల సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇక విజయ్ సేతుపతి చాలా సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. మంజువారియర్, కెన్ కరుణాస్, కిశోర్ నటన బాగుంది. విజయ్ సేతుపతి ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. వాథియార్ ఎదుగుదలకు కారణాలతో బలంగా చూపించబడ్డాయి. విరామ సమయానికి ఫస్ట్ హాఫ్ పోరాటం ప్రారంభం మాత్రమే..
#ViduthalaiPart2 – #VijaySethupathi has given a splendid performance. #KenKarunas #RajivMenon #ManjuWarrier #Soori (Short duration thou) 👌. Well choreographed Action sequences, beautifully shot songs, thoughtful and power packed dialogues elevates this film. Screenplay dips… pic.twitter.com/sGo4Abxlvy
— Fab Flickz (@FabFlickz) December 20, 2024
అసురన్‌లో అదిరిపోయే పర్ఫార్మెన్స్తో అదరగొట్టిన కెన్ కరుణాస్.. వెట్రిమారన్ విడుదలైలో మరోసారి షేక్ చేశాడు. చిన్న సీక్వెన్స్‌లో కనిపించినప్పటికీ బలమైన ప్రభావాన్ని చూపించాడని చెప్పాలి.
వెట్రిమారన్ పవర్ ఫుల్ సన్నివేశాలను చూపించడమే కాకుండా రొమాంటిక్ సీక్వెన్స్‌ను కూడా అందంగా చూపించాడు. మక్కళ్ సెల్వన్, మంజువారియర్ మధ్య వచ్చే ఓ సన్నివేశం హైలెట్ అని చెప్పొచ్చు.
#ViduthalaiPart2 – ✌️
Vetrimaaran’s Craft & Ideology never disappoints. VJS superb. Limited role 4 Soori. Rajiv Menen & Ken Karunas rockz. Terrific & Intense Initial 30Mins Setup. Slight lag & Repetitiveness r thr. Beautiful Songs, Powerful Dialoges, Raw Actions. GOOD Watch!
— Christopher Kanagaraj (@Chrissuccess) December 20, 2024
వెట్రిమారణ్ క్రాఫ్ట్, ఐడియాలజీ ఎప్పుడూ ప్రేక్షకులను నిరాశపరచదు. విజయ్ సేతుపతి అద్భుతంగా నటించాడు. సూరి లిమిటెడ్ సీన్స్‌లో కనిపించినా ఆకట్టుకున్నాడు. రాజీవ్ మీనన్, కెన్ కరుణాస్ రాకింగ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారు. అద్భుతమైన, ఇంటెన్స్సాగే 30 నిమిషాల ఎపిసోడ్ స్పెషల్ అట్రాక్షన్. కొంచెం సాగదీతగా అనిపించినా.. అందమైన పాటలు, పవర్ ఫుల్ డైలాగ్స్, రా యాక్షన్ పార్ట్‌తో చూడదగిన సినిమా.
నెగిటివ్ అంశాలు..
సుదీర్ఘంగా సాగే సంభాషణలు..
కొన్ని సాగదీతగా సాగే అంశాలు..
Pooja Hegde | పూజా హెగ్డే 2024 రౌండప్.. నో యాక్షన్.. నో రిలీజ్
Shankar | గెట్ రెడీ అంటోన్న శంకర్.. థియేటర్లలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3