తమిళ అగ్రహీరో విజయ్ సేతుపతి హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటైర్టెనర్‌గా ఈ సినిమా రూపొందనున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. తన సంతకాన్నీ, విజయ్ సేతుపతి అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్‌ని మిక్స్ చేసి పూరీ అద్భుతమైన స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారని, సాంకేతికంగా కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా ఉండబోతున్నదని మేకర్స్ చెబుతున్నారు.
కాస్ట్ అండ్ క్రూ ఇప్పటికే ఖరారైంది. తొలి షెడ్యూల్కోసం సరైన లొకేషన్లను వెతికే పనిలో హైదరాబాద్, చెన్నయ్ నగరాలను టీమ్ జల్లెడ పడుతున్నారు. జూన్ చివరి వారంలో షూటింగ్ మొదలు కానుంది. విజయ్ సేతుపతితోపాటు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొంటారు. విజయ్ సేతపతి నెవర్ బిఫోర్ అనిపించే పాత్ర పోషించనున్న ఈ చిత్రంలో టబు, విజయ్ కమార్ కీలక పాత్రధారులు. పూరీజగన్నాథ్, ఛార్మికౌర్ నిర్మాతలు.