Vijay Sethupathi| బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘జవాన్’ (Jawan). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. జవాన్ నుంచి విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ.. DEALER OF DEATH క్యాప్షన్‌తో తాజా లుక్ షేర్ చేశారు. బ్లాక్ స్టైలిష్ గాగుల్స్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇప్పుడీ లుక్ నెట్టింటిని షేక్ చేస్తోంది.
మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట టీజర్‌తోపాటు Jawan Prevue సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. జవాన్ ట్రైలర్లో షారుక్ ఖాన్ జవాన్‌లో కిల్లింగ్ యాక్టింగ్‌తో ఇరగదీయబోతున్నాడని, ఇంటెన్స్ యాక్షన్ పార్టు, స్టన్నింగ్ విజువల్స్‌తో సాగే Prevue చెబుతోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో తండ్రి, కొడుకుగా డ్యుయల్ రోల్లో కనిపించబోతున్నట్టు సమాచారం.
జవాన్‌లో నయనతార ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలలో నటిస్తుండగా.. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే అతిథి పాత్రలో కనిపించనుంది. జవాన్ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీని షారుఖ్ ఖాన్ హోంబ్యానర్ రెడీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గౌరీఖాన్ తెరకెక్కిస్తోంది.
Ready or not, here comes the destruction! ⚡#VijaySethupathi#JawanPrevue Out Now – https://t.co/CUWX1S7sQ4#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu pic.twitter.com/eo0rhJMABi
— Red Chillies Entertainment (@RedChilliesEnt) July 24, 2023
జవాన్ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ ..
Jawan Prevue..