Phoenix Movie | ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఫీనిక్స్'(Phoenix Movie). ఈ చిత్రం జూలై 04న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రీమియర్ షో చెన్నైలో ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి విజయ్ సేతుపతి ముఖ్య అతిథిగా హాజరై తన కుమారుడిని అభినందించారు. ప్రీమియర్ షో అనంతరం, విజయ్ సేతుపతి తన కుమారుడు సూర్యను మీడియా ముందే ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ భావోద్వేగ క్షణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా బృందాన్ని, దర్శకుడు అనల్ అరసును కూడా ఆయన అభినందించారు.
‘ఫీనిక్స్’ ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ అనల్ అరసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సూర్యతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, దేవదర్శిని, జె విఘ్నేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంపత్ రాజ్, దిలీపన్, ముత్తుకుమార్, హరీష్ ఉత్తమన్, అజయ్ ఘోష్ వంటి వారు సహాయక పాత్రల్లో నటించారు.
సూర్య గతంలో ‘నానుమ్ రౌడీ ధాన్’, ‘సింధుబాద్’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా కనిపించినప్పటికీ, ‘ఫీనిక్స్’తో పూర్తి స్థాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా కోసం సూర్య తన బరువును 120 కిలోల నుండి తగ్గించుకోవడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు కష్టపడ్డాడని, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) కూడా నేర్చుకున్నాడని ఇటీవలే వెల్లడించాడు.
Big weekend ahead for #SuryaSethupathi – Tamil cinema debut with his action flick #Phoenix 💥
— Venkatramanan (@VenkatRamanan_) July 3, 2025