Ace Trailer | పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. మక్కళ్ సెల్వన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఏస్ (Ace). ‘ఒరు నల్ల నాల్ పాత్తు సొల్రెన్’ ఫేం ఆరుముగకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా… యోగి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ మే 23, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే తెలుగు ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.
ట్రైలర్లో నువ్వు అక్కడేం చేస్తావురా అని ఫ్రెండ్ అడుగుతుంటే.. పాత ఐడెంటిటీస్ అన్నీ చింపేసి అందరిలా మామూలుగా బతకాలనుంది. నా పేరు బోల్ట్ కాశీ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు విజయ్ సేతుపతి. నువ్వు ఈ ఊరికి ఏ పని మీదొచ్చావ్ అని హీరోయిన్ అడిగితే ఏం చేయాలో నేను ప్లాన్ చేశానంటున్నాడు. అసలు నీ ప్లాన్ ఏంటో చెప్పరా అని యోగిబాబు అడుగుతుంటే నాకీ ప్లాన్ ఓకే అంటోంది రుక్మిణి వసంత్. ఇంతకీ బోల్ట్ కాశీ పాత ఐడెంటిటీస్ ఏంటీ.. అతని స్కెచ్ ఏంటనేది సస్పెన్స్‌లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయ్ సేతుపతి నుంచి అభిమానులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉండబోతున్నాయని ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది.
ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్పీ సినిమాస్ విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు. రొమాంటిక్ క్రైం కామెడీ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీతో రుక్మిణి వసంత్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, బిఎస్. అవినాష్, ముత్తు కుమార్, రాజ్ కుమార్, డెనెస్ కుమార్, ఆల్విన్ మార్టిన్, ప్రిస్సిల్లా నాయర్, జాస్పర్ సుపయ్య, కార్తీక్ జై, నాగులన్, జహ్రినారిస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని 7Cs ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ నిర్మిస్తుంది.
ఏస్ ట్రైలర్..
Vishal | త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న విశాల్.. పెళ్లి కూతురు టాలీవుడ్ హీరోయినే..!
Theatres | జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్.. కారణమిదే..!