Vishal | ప్రముఖ నటుడు విశాల్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. ప్రస్తుతం ఆయన పెళ్లి టాపిక్ టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పెళ్లి వార్తలను విశాల్ సైతం ధ్రువీకరించిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు చూసుకోబోది ప్రముఖ హీరోయిన్ సాయి ధన్సికనేనని సమాచారం. గత కొంతకాలంగా ఇద్దరు ప్రేమలో ఉన్నారని.. పెళ్లికి ఇటీవల రెండు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. త్వరలోనే వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు విశాల్ గానీ, ధన్సిక కానీ స్పందించలేదు.
ఇదిలా ఉండగా.. ఇటీవల నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో విశాల్ మీడియాతో మాట్లాడారు. క్రమంలో పెళ్లిపై ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని.. జీవిత భాగస్వామిని సైతం గుర్తించానని.. పెళ్లి విషయంలో చర్చలు జరుగుతున్నట్లు విశాల్ తెలిపాడు. ఇది ప్రేమ పెళ్లేనని.. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నట్లు తెలిపాడు. గతంలో నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని విశాల్ ప్రకటించిన విషయం విధితమే. ఇచ్చిన మాట ప్రకారం భవన నిర్మాణం పూర్తి కావడంతో పెళ్లికి రెడీ అయ్యారు. ఇక విశాల్ పెళ్లి వార్తలు కొత్తేం కాదు. గతంలో పలువురు హీరోయిన్లను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
Sai Dhanshika
వరలక్ష్మి శరత్ కుమార్, అభినయను పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చినా అవేవి నిజం కాలేదు. వాస్తవానికి విశాల్‌కు గతంలో హైదరాబాద్‌కి చెందిన అనీషా అనే అమ్మాయితో పెళ్లి జరగాల్సి ఉన్నా ఎందుకో రద్దు చేసుకున్నారు. నిశ్చితార్థం జరిగినా అది పెళ్లిపీటల దాకా చేరలేదు. ధన్సిక విషయానికి వస్తే.. తమిళనాడులోని తంజావూరు ఆమె స్వస్థలం. తమిళం, కన్నడం, మలయాళం, తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. 2006లో తమిళ చిత్రంలో నటించింది. తెలుగులో 2022లో ‘షికారు’ మూవీలో నటించింది. ఆ తర్వాత అంతిమ తీర్పు, దక్షిణ సినిమాల్లోనూ కనిపించింది. ఇక విశాల్ చివరిసారిగా మద గజ రాజ మూవీలో నటించారు. ప్రస్తుతం తుప్పరివాలం-2 మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీకి దర్శకత్వం సైతం వహిస్తుండడం విశేషం.