TVK Chief Vijay | కోలీవుడ్ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఒకవైపు కోర్టులో నడుస్తుండగా.. ప్రస్తుతం తమిళనాడు ఎలక్షన్ బిజీలో ఉన్నాడు విజయ్. ఈ క్రమంలోనే ఒక ఊరిలో రోడ్ షోలో పాల్గోనగా.. విజయ్ను కలిసిన ఒక అభిమాని ఆయనకు ఏకంగా తన వివాహానికి సంబంధించిన పాత ఫోటోను బహుమతిగా ఇవ్వడం, దానికి విజయ్ స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. విడాకుల వ్యవహారం నడుస్తున్న తరుణంలో ఈ పెళ్లి ఫోటోను చూసిన విజయ్ ఏమాత్రం కోపగించుకోకుండా, చాలా సున్నితంగా దానిని అందుకుని చిరునవ్వుతో ఆ అభిమానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ ఫోటోను చూస్తున్నప్పుడు విజయ్ ముఖంలో కనిపించిన చిన్నపాటి విషాదం మరియు భావోద్వేగం అక్కడున్న వారిని కదిలించగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
మరోవైపు విజయ్ భార్య సంగీత ఇప్పటికే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారని, సుమారు రూ. 250 కోట్ల భరణం విషయంలో చర్చలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఒక స్టార్ హీరోయిన్‌తో ఏర్పడిన సాన్నిహిత్యమే వీరిద్దరి మధ్య మనస్పర్థలకు కారణమని పుకార్లు వస్తున్నప్పటికీ, విజయ్ మాత్రం వీటిపై నేరుగా స్పందించలేదు. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన కీలక సమయంలో ఇటువంటి వ్యక్తిగత వివాదాలు ఆయన ప్రతిష్టపై ప్రభావం చూపుతాయేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ, అభిమాని ఇచ్చిన పెళ్లి ఫోటోను ఆయన స్వీకరించిన తీరు విజయ్ హుందాతనాన్ని చాటిచెప్పిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
#ThalapathyVijay spots a photo frame of him with his wife #Sangeetha and #Vijaykanth. Out of the entire crowd, he makes sure to receive it and looks at it emotionally 🥹 for a few seconds, then returns back normal and passes it to his security. pic.twitter.com/P60I23rr64
— Movies Singapore (@MoviesSingapore) April 14, 2026