Vijay – Rashmika | టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా రూమర్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ప్రేమకథపై త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది. ఇద్దరూ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారని, తాజాగా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని టాలీవుడ్ వర్గాలు ధృవీకరించాయి. అధికారికంగా ప్రకటించకపోయినా, విజయ్–రష్మిక టీమ్ మీడియాకు సమాచారం అందించడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. అదీ కాక, వీరిద్దరు కొత్త రింగులతో కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. రష్మిక తాజా సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో రష్మిక బిజీగా ఉంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్‌గా హాజరవుతాడని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది.
దీంతో నిశ్చితార్థం తర్వాత మొదటిసారి విజయ్–రష్మిక ఒకే స్టేజ్‌పై కలిసి కనిపించబోతున్నారని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరూ ఒకే ఈవెంట్లో పాల్గొంటే మీడియా దృష్టి అంతా వారిపైనే ఉండనుంది. ఈ సందర్భంగా విజయ్, రష్మిక ప్రచారాలపై ఎలా రియాక్ట్ అవుతారు? పెళ్లి గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా? లేదా ఫ్యాన్స్ కోసం కలిసి ఫోటోలకు పోజులిస్తారా? అన్న ప్రశ్నలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు నిశ్చితార్థం గురించి ఇద్దరూ ప్రకటన చేయకపోయినా, అభిమానులు మాత్రం త్వరలోనే వారి పెళ్లి తేదీ బయటకు వస్తుందని నమ్ముతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌నే ఇద్దరి జీవితంలో కొత్త చాప్టర్ ఆరంభానికి వేదిక కానుందా అన్న ఆసక్తి అందరిలో ఉంది.
మొత్తానికి, రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకంటే ఎక్కువగా, ఈ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ హాజరుకానున్నాడా లేదా? అనేది ఇప్పుడు టాలీవుడ్ అంతా ఎదురుచూస్తున్న ప్రశ్నగా మారింది. “ఇది రీల్ లవ్ కాదు, రియల్ లవ్ స్టేజ్!” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వారి కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కాగా రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో కలిసి నటించారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టినట్టు తెలుస్తుంది.