Vijay Deverakonda | జయాపజయాలకు అతీతమైన క్రేజ్ విజయ్ దేవరకొండది. ఆయన డేట్స్ కోసం నేటికీ నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘కింగ్డమ్’ షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. మే 30న సినిమా విడుదల కానున్నట్టు సమాచారం. ఇదిలావుంటే.. ‘కింగ్డమ్’ సినిమా నిర్మాణంలో ఉండగానే మరో సినిమాకు పచ్చజెండా ఊపేశారు విజయ్ దేవరకొండ.
‘రాజావారు రాణివారు’ఫేం రవికిరణ్ కోలా దర్శకత్వంలో, అగ్ర నిర్మాత దిల్రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘రౌడీ జనార్దన్’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్టు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్రాజు ప్రకటించేశారు. విజయ్ దేవరకొండ కెరీర్లోనే విభిన్నమైన చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని ఇన్సైడ్ టాక్. ఇక ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.