అగ్ర హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘కింగ్డమ్’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. పీరియాడిక్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ప్రచార చిత్రాలు, పాటలకు కూడా అద్భుతమైన స్పందన లభించడంతో హిట్ గ్యారంటీ అంటున్నారు విజయ్ అభిమానులు. ఇదిలావుండగా ఈ చిత్రాన్ని హిందీలో ‘సామ్రాజ్య’ అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు.
ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఉత్తరాది యువతలో కూడా విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశముందని అంటున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తెలుగు రాష్ర్టాల్లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నది.