Kingdom Movie Completes Censor | రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు శుభవార్త! ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కింగ్డమ్’ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు ఈరోజు తిరుపతిలో జరుగుతున్న కింగ్డమ్ మూవీ ఈవెంట్లో సినిమా ట్రైలర్ విడుదల కానుంది. దీనికోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
The gun is loaded
And The rage is real 🔥BLAZING ALL GUNS with a U/A Certificate 💥💥
Let the rampage begin with the #KingdomTrailer today 🌋 #Kingdom #KingdomOnJuly31st @TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse @dopjomon #GirishGangadharan… pic.twitter.com/qTLheP8qMY
— Sithara Entertainments (@SitharaEnts) July 26, 2025