Vijay Deverakonda | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నేడు తన 36న పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఇక విజయ్ బర్త్డే కానుకగా ఆయన నటిస్తున్న సినిమాల్లో నుంచి అప్డేట్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కింగ్డమ్ నుంచి కొత్త పోస్టర్ విడుదల కాగా.. తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ వీడి14కి సంబంధించి బర్త్డే విషెస్ తెలుపుతూ కొత్త పోస్టర్ను పంచుకుంది చిత్రయూనిట్. అయితే ఈ పోస్టర్లో విజయ్ ముఖాన్ని చూపించలేదు. ఒక దేవుడి విగ్రహం ముందు విజయ్ ధ్యానం చేస్తున్నట్లుగా ఉంది. కేవలం వీపు భాగాన్ని మాత్రమే చూపించారు. ఈ పోస్టర్లో విజయ్ కండల తిరిగిన శరీరంతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో ఈ పోస్టర్ క్షణాల్లో వైరల్ అవ్వగా, అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
శ్యామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతుంది. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో రాయలసీమ నేపథ్యంలో 1854 – 1878 మధ్య కాలంలో జరిగే ఆసక్తికర కథాంశంతో రూపొందనుంది. దీంట్లో విజయ్ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం.
The GODS gave him STRENGTH. War gave him a PURPOSE 🔥
Team #VD14 wishes @TheDeverakonda a very Happy Birthday ❤️🔥@rahulsankrityan @mythriofficial #BhushanKumar #KrishanKumar @tseriesfilms @tseries.official @shivchanana @neerajkalyan24 pic.twitter.com/sorMDxFXtT
— Rahul Sankrityan (@Rahul_Sankrityn) May 9, 2025